20 March, 2026 | 9:13 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

రహదారులకు రూ.2.78 లక్షల కోట్లు

24-07-2024 12:44 AM

న్యూఢిల్లీ, జూలై 23: మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)కి 2024 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ. 1.68 లక్షల కోట్ల నిధులను కేటాయించారు. ఇంత కు ముందు ప్రవేశపెట్టిన ఎన్నికల బడ్జెట్‌లో కూడా ఇంతే మొత్తం లో కేటాయించారు. దేశంలో ఉన్న హైవేల కోసం రూ. 2.78 లక్షల కోట్లను కేటాయించారు. 2023 బడ్జెట్‌లో  రహదారులకు రూ. 2.70 లక్షల కోట్లు కేటాయించగా.. తర్వాత రూ. 2.76 లక్షల కోట్లకు అంచనాలను సవరించారు. ఎన్‌హెచ్‌ఏఐ దేశంలోని జాతీయ రహదారుల నిర్మాణం, నిర్వహణ చూసుకుంటుంది. 2023 13,800 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించుకోగా.. 12,349 కిలోమీటర్ల మేర నిర్మించింది. ఇక 2023 ఆర్థిక సంవత్సరంలో 10,993 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించారు.