calender_icon.png 1 May, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిన్న భార్య.. నేడు భర్త

10-04-2025 12:00:00 AM

రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్య?

ఎల్బీనగర్, ఏప్రిల్ 9: హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక్కరోజు వ్యవధిలోనే భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంపంగి నగేశ్ (25), శిరీష(20)లకు రెండేండ్ల క్రి తం వివాహం కాగా, 11 నెలల వయస్సున్న బాబు ఉన్నాడు. వారు హ యత్‌నగర్ డివిజన్ ముదిరాజ్ కాలనీలో నివాసముంటున్నారు. కాగా, కుటుంబ కలహాల నేపథ్యంలో శిరీష మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురా లి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదుతో హ యత్‌నగర్ పోలీసులు కేసు నమో దు చేసుకుని, విచారణ చేపట్టారు. ఈ క్రమంలో భర్త నగేశ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి, విచారించారు.

మంగళవారం రాత్రి 9 గంటలకు కుటుంబ సభ్యులు షూరిటీపై నగేశ్ ను ఇంటికి తీసుకెళ్లారు. భార్య ఆత్మహత్యపై కలత చెందిన నగేశ్ బుధవారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. హయత్‌నగర్‌లోని రిలయన్స్ డిజిటల్ షాపింగ్‌మాల్ పైనుంచి దూకి నగేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి బాలరాజు ఫిర్యాదుతో హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. నగేశ్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా నగేశ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, విదేశాలకు వెళ్లే ప్రణాళికతో ఉన్నాడు.