18 May, 2026 | 5:35 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

18-05-2026 04:41 PM

నిజాంసాగర్ మే 18( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లానిజాంసాగర్ మండలం వెలగనూరు గ్రామ శివారు161 జాతీయ రహదారిపై  ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. నిజాం సాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం   లకావత్ రామ్ 33,జరప్ల సూర్య 34,అనే ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుని , బంధువుల ఫంక్షన్ నిమిత్తం సొంత గ్రామానికి వచ్చి  బైక్‌పై తిరిగి వెళ్తుండగా, మామిడికాయల లోడ్‌తో ఉన్న టాటా ట్రక్కు (MH 27 BX 5316) అతివేగంగా వీరి వాహనాన్ని ఢీకొట్టగా . ప్రమాదంలో లకావత్ రామ్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన సూర్య ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు ఆయన తెలిపారు . మృతుడి భార్య లకావత్ సోనియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు అయన తెలిపారు.