వాసవి పాఠశాలలో ఘనంగా ఉగాది వేడుకలు
ఉగాది పచ్చడి తయారు చేసి విద్యార్థులకు పంపిణీ చేసిన ఉపాధ్యాయులు...
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని వాసవి పాఠశాలలో ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ఉగాది పచ్చడిని తయారుచేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లక్ష్మీ శ్వేత మాట్లాడుతూ ఉగాది పచ్చడి తెలుగువారి నూతన సంవత్సర వేడుకలో అత్యంత ముఖ్యమైన ప్రసాదం.
ఇది షడ్రుచుల (తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు) కలయికతో, జీవితంలోని సుఖ-దుఃఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుంది. వేపపువ్వు, మామిడి ముక్కలు, బెల్లం వంటి వాటితో చేసే ఈపచ్చడి, ఆరోగ్యాన్ని పెంచి వసంతకాలంలో రోగాలను నిరోధిస్తుందని ఆమె తెలిపారు. విద్యార్థులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్లు పాలకుర్తి విజయ్, మోటమర్రి సంధ్యారాణి ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




