నవోదయ ఫలితాల్లో సత్తా చాటిన శ్రీ బాలాజీ నవోదయ సైనిక్ అకాడమీ
జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించిన సాయి శ్రీయాంక్
కోదాడ: పట్టణంలోని శ్రీ బాలాజీ నవోదయ సైనిక్ అకాడమీ విద్యార్థులు జిల్లా ర్యాంకులు సాధించి సత్తా చాటారని అకాడమీ నిర్వాహకులు విజయ్ తెలిపారు. బుధవారం నవోదయ లో ర్యాంక్ లు సాధించిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులను శాలువా, బొకేలతో సన్మానించారు.
అనంతరం విజయ్ మాట్లాడుతూ ఇదేవిధంగా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. నవోదయ రిజల్ట్ లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ ఎం సాయి శ్రీయాంక్ , జిల్లా థర్డ్ ర్యాంక్ టి విశ్వదీప్, జిల్లా ఫోర్త్ ర్యాంక్ భూక్యా రుచిత , సిహెచ్ సహస్ర జిల్లా 48 వ ర్యాంక్ సాధించారు.
జిల్లా ర్యాంకులు సాధించడంతో విద్యార్థులను అభినందించారు. అంచలంచెలుగా శ్రీ బాలాజీ నవోదయ సైనిక్ అకాడమీ లో ర్యాంకులు రావడంతో పలువురు అభినందనలు తెలియజేశారు. తమ పిల్లలకు జిల్లా ర్యాంకులు రావడంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు లలిత, విద్యార్థులు ,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు




