వర్క్‌స్పేస్ ఎర్గోనామిక్స్‌పై అవగాహన

09-09-2026 | 05:20am

అస్టర్ డీఎం క్వాలిటీ కేర్‌లో సదస్సు

ఉద్యోగుల ఆరోగ్యమే సంస్థకు పునాది: డాక్టర్ అమిత్ సింగ్

హైదరాబాద్, సెప్టెంబరు 8 (విజయక్రాంతి): ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, కంప్యూటర్ స్క్రీన్ల ముందు గంటల తరబడి గడపడం, సరైన భంగిమ పాటించకపోవడం వల్ల మెడ, భుజాలు, నడుము, మణికట్టు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యని పుణులు తెలిపారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా అస్టర్ డీఎం క్వాలిటీ కేర్ హైదరాబాద్ కార్యాలయంలో ‘ఎర్గోనామిక్స్ ఎట్ వర్క్‌స్పేస్’ అంశంపై ఉద్యోగులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేర్ హాస్పిటల్స్(CARE Hospitals), అస్టర్ హాస్పిటల్స్‌(Aster Hospitals)కు చెందిన ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు.

ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ విభా సిద్ధన్నవర్ ఉద్యోగులకు సరైన రీతిలో కూర్చోవడం, కంప్యూటర్ స్క్రీన్, కుర్చీ, డెస్కును అనువుగా ఏర్పాటు చేసుకోవడం, మధ్య మధ్యలో చిన్న విరామాలు తీసుకుని కదలడం, స్ట్రెచింగ్ చేయ డం వంటి అంశాలను వివరించారు. కూర్చు నే విధానం, పనిచేసే ప్రదేశం, మధ్య మధ్య లో కదలడం వంటి చిన్న మార్పులే మంచి ఫలితాలను ఇస్తాయి. అస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ గ్రూప్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ డాక్టర్ అమిత్ సింగ్ మాట్లాడుతూ.. ఆరోగ్య సేవల వెనుక మా ఉద్యోగు ల కృషి ఎంతో కీలకం. అందుకే వారి ఆరో గ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కాగా ఏటా సెప్టెంబరు 8న ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు