గోదావరి వంతెన వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
08-08-2026 10:36 AM
బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాచలం గోదావరి వంతెన సారపాక వైపు మూడో నంబరు పిల్లర్ వద్ద శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 40–45 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. బూడిద రంగు ఫుల్‌హ్యాండ్స్ షర్టు, నీలిరంగు జీన్స్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు బూర్గంపాడు పోలీసులను సంప్రదించాలని కోరారు.
సంప్రదించాల్సిన నంబర్లు:
ఎస్‌హెచ్‌ఓ, బూర్గంపాడు : 8712682055
ఎస్‌ఐ–2, బూర్గంపాడు: 8712682057






