8 August, 2026 | 11:40 AM

ప్రభుత్వ పాఠశాలలే భవిష్యత్తుకు బాటలు

08-08-2026 10:53 AM

వంగ రాజేశ్వర్ రెడ్డి

సిద్దిపేట రూరల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలే భవిష్యత్తుకు బాటలు వేస్తాయని, విద్యార్థులే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని సామాజిక సేవకుడు వంగ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట రూరల్ మండలంలోని బండచర్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రామ ఉపసర్పంచ్ రంజిత్, వార్డు సభ్యుడు బొందని పరమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత యూనిఫామ్‌ల పంపిణీ చేశారు. వంగ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలవడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు బొందని శ్రీకాంత్, మంగళారపు స్వామి, రాజశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.