7 June, 2026 | 7:08 PM

నా పుట్టుక.. నా చావు.. రెండు బీజేపీలోనే

07-06-2026 05:51 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అంశంపై ఎక్కడ చర్చ పెట్టినా నేను సిద్ధంగా ఉన్నానని ఆయన సవాల్ విసిరారు. నీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని, పొలిమేరకు రాకుండా నన్ను ఆపేటోడు తెలంగాణలో ఇంకా పుట్టలేదని కేంద్రమంత్రి విరుచుకుపడ్డారు. నేను నీలాగా పది పార్టీలు మారలేదు అని, నా పుట్టుక.. నా చావు.. రెండు భారతీయ జనతా పార్టీలోనే అని హెచ్చరించారు. నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు అని, నువ్వు ఎంత రెచ్చగొట్టినా నేను తొందరపడను అని కిషన్ రెడ్డి చెప్పారు. అన్నింటికీ సమయమే సమాధానం చెప్తుందని, ముందు నువ్వు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు అని వ్యంగ్యంగా మాట్లాడారు. దళితులు, బీసీలు నీ ఇంటికి వచ్చి ధర్నాలు చేస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.