ఆటో డ్రైవర్ కుటుంబానికి యూనియన్ అండ
బూర్గంపాడు,(విజయక్రాంతి): అనారోగ్యంతో(Illness) మృతి చెందిన ఆటో డ్రైవర్(Auto-rickshaw driver) కుటుంబానికి బూర్గంపాడు ఆటో యూనియన్ సభ్యులు(Burgampadu Auto Union members) ఆర్థిక చేయూత అందించారు. మండల కేంద్రంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఈర్ల నాగేశ్వరరావు(Irla Nageswara Rao) రెండు కిడ్నీలు విఫలమై(kidney failure) మృతి చెందారు. విషయం తెలుసుకున్న యూనియన్ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి రూ.45 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సాదిక్ పాషా మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. ఆటో యూనియన్ సభ్యుల సంక్షేమానికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ అన్వర్ పాషా, ప్రధాన కార్యదర్శి పెద్ద యాకూబ్, సహాయ కార్యదర్శి కేసుపాక సంపత్, చిప్ప సాయి నిఖిల్, యూనియన్ సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.