విశ్వకర్మ ఆశీస్సులతో... ఐక్యత ఆధ్యాత్మికత పెంపొందించాలి..

16-09-2026 | 08:14pm

విరాట్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం

జవహర్ నగర్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): విశ్వకర్మ ఆశీస్సులతో ఐక్యత, ఆధ్యాత్మికత, సోదర భావం మరింత పెంపొందాలని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం(Viswabrahmana Vishwakarma Sangam) జవహర్ నగర్ ప్రతినిధులు పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని మహంకాళి దేవాలయ ప్రాంగణంలో ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి తరలి రావాలని కోరుతూ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ని మేడ్చల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిని జవహర్ నగర్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం సభ్యులు బుధవారం ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మహోత్సవ కార్యక్రమా వివరాలను తెలియజేసి యజ్ఞ మహోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానం అందించారు. విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులతో సమాజంలో ఐక్యత ఆధ్యాత్మికత సోదర భావం సౌబ్రాత్రుత్వం విశ్వ మానవత్వం మరింత పెంపొందాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ యజ్ఞ మహోత్సవానికి ప్రతి ఒక్కరు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వ కర్మ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు