5 June, 2026 | 8:03 PM

కాంగ్రెస్ హటావో – సింగరేణి బచావో సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ

05-06-2026 07:28 PM

మణుగూరు,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సిరుల మాగాణి సింగరేణి పరిరక్షణ కోసం  తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన గోదావరి ఖనిలో నిర్వహించనున్న “కాంగ్రెస్ హటావో–సింగరేణి బచావో” సదస్సుకు సంబంధించిన గోడపత్రికను శుక్రవారం మణుగూరులోని జయశంకర్ సార్ టీబీజీ కేఎస్ కార్యాలయంలో ఆ యూనియన్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా టీబీజీకేఎస్ సెంట్రల్ వైస్ ప్రెసిడెం ట్ వి. ప్రభాకర్ రావు, ఏరియా వైస్ ప్రెసి డెంట్ నాగెల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ దిశానిర్దేశం, రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి నాయకత్వంలో సింగ రేణి పరిరక్షణ కోసం దశలవారీ ఉద్యమా లకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

అందులో భాగంగా జూన్ 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు గోదావరిఖనిలోని  భారీ సద స్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా తన్నీరు హరీష్ రావు హాజరుకానుండగా, విశిష్ట అతిథులుగా కొప్పుల ఈశ్వర్, కోవా లక్ష్మీ, బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, నడిపల్లి దివాకర్ రావు, కోరుకుంటి చందర్, పుట్ట మధు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. సింగరేణి కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలు, తప్పుడు బొగ్గు నిల్వల అంశం, సింగరేణిపై ఆర్థిక భారం, మెడికల్ బోర్డుల రద్దు ప్రయత్నాలు, డిపెం డెంట్ ఉద్యోగాలపై విజిలెన్స్ వేధింపులు, రాష్ట్ర ప్రభుత్వ బొగ్గు బకాయిలు, విజిలె న్స్ కేసుల పరిష్కారం, గైర్హాజరు కార్మికు ల డిస్మిస్‌లు తదితర కీలక అంశాలను సదస్సులో చర్చించనున్నట్లు నాయకులు స్పష్టం చేశారు. సంస్థ ప్రగతి, కార్మిక సంక్షే మం, హక్కుల పరిరక్షణ కోసం టీబీజీకే ఎస్బి చేపడుతున్న పోరాటాలకు కార్మికు లు, కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు బంగారి పవన్ కుమార్, ఇజ్రా యిల్, మస్తాన్, బొద్దుల ప్రవీణ్ కుమార్, ఐ. శంకర్, సివిల్ మోహన్ రావు, శ్రీనివా స్, బాలాజీ, సక్రు, ఇసాక్,వెంకట్, థామ స్  పాల్గొన్నారు.