పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి
మఠంపల్లి,(విజయక్రాంతి): పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మఠంపల్లి సర్పంచ్ ఏసుమల్ల వీరలక్ష్మి పాపయ్య కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి ఒక్క జీవి జీవనానికి పర్యావరణమే ఆధారమని ప్రకృతిని కాపాడేందుకు అందరూ కట్టుబడి ఉండాలని,స్వచ్ఛమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మనిషి మనుగడకు, జీవనానికి పరిశుభ్రమైన గాలి,స్వచ్ఛమైన నీరు, పచ్చని చెట్లు ఎంతో అవసరం కానీ కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్ధాలు, అడవుల నరికివేత వల్ల పర్యావరణం కలుషితమవుతుందన్నారు.గ్రామ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని,ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా సర్పంచ్,పంచాయతీ కార్యదర్శి వార్డు సభ్యులతో, సిబ్బంది తో కలిసి మొక్కలు నాటారు.






