డీహెచ్పీఎస్ రెండో రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
దళిత హక్కుల పోరాట సమితి వాల్ పోస్టర్ ఆవిష్కరణ
దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మల్లేశం
జవహర్ నగర్,(విజయక్రాంతి): ఈనెల 17, 18వ తారీకున జరిగే డీహెచ్పీఎస్ రెండవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని, జవహర్ నగర్ లోని అంబేద్కర్ ప్రధాన చౌరస్తాలో శనివారం వాల్పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మల్లేశం హాజరై మాట్లాడుతూ... రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు అనగారిన వర్గాలను అణచి వేస్తూనే ఉన్నాయి.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాల పరిపాలనలో నేటికీ దళితులపై జరుగుతున్న దాడులు ఆగట్లేదని అంటరాని తనం కులవివక్షత ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు దళితులను నేటికీ అన్ని రంగాల్లో అభివృద్ధికి ఆ మడ దూరంలో నెట్టి వేస్తున్నాయన్నారు. ఈనెల 17 ,18 వ తారీకుల్లో వరంగల్లో జరిగే రాష్ట్ర మహాసభలకు ప్రజా సంఘాలు, మేధావులు, హాజరై ఈ సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.




