23 June, 2026 | 11:05 AM

Breaking News

బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ   •   ప్రైవేట్ స్కూల్ నుంచి సర్కార్ బడికి సర్పంచ్ కూతురు   •   ముదిరాజ్ సంఘ మాజీ అధ్యక్షుడు వంతడుపుల అలియాస్ గొడుగు నర్సయ్య మృతి   •   ఆధారాలు ఉంటే చూపించండి.. మేము లెక్కలు చూపించడానికి సిద్ధం   •   విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం   •   తెలుగే కదా పండితుడు ఎందుకు అనుకుంటున్నారా?   •   కామారెడ్డిలో బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్   •   ప్రభుత్వ ఇసుక రీచ్‌పై దాడి.. సైట్ ఇంచార్జీపై దౌర్జన్యం   •   కోరం కనకయ్య వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో కూడినవి: హరిప్రియ నాయక్   •   వ్యభిచారానికి అడ్డు చెప్పిన గ్రామస్తులపై కత్తితో దాడి   •  

న్యూ బస్ స్టాండ్‌లో వ్యక్తిని హత్య చేసిన నిందితుడి అరెస్ట్, రిమాండ్

04-04-2026 05:35 PM

సెల్ ఫోన్, నగదు కోసం దాడి

 నిందితుడి నుండి ఫోన్ స్వాధీనం

కేసును ఛేదించిన కామారెడ్డి పోలీస్ అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ

కామారెడ్డి,(విజయక్రాంతి): న్యూ బస్టాండ్ లో హత్యకు గురైన వ్యక్తి కేసును కామారెడ్డి పోలీసులు చేదించారు. హత్యకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసు నిందితుడి వివరాలను వెల్లడించారు. కామారెడ్డి పట్టణంలోని న్యూ బస్ స్టాండ్‌లో గత ఫిబ్రవరిలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేవలం మొబైల్ ఫోన్, నగదు కోసం తోటి కూలీని అత్యంత కిరాతకంగా హతమార్చిన నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు కామారెడ్డి ఏఎస్పి బి. చైతన్య రెడ్డి,  వివరాలను వెల్లడించారు.

గత ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి సుమారు 8:55 గంటల సమయంలో, కామారెడ్డి బస్ స్టాండ్ ఎంక్వయిరీ కౌంటర్ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య మొబైల్ ఫోన్ విషయమై ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో నిందితుడు బాధితుడైన శ్రీనివాస్ (కూలీ) పై ముఖం, ఛాతిపై విచక్షణారహితంగా దాడి చేసి, కిందపడేసి హత్య చేశాడు. అనంతరం బాధితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ రూ. 300 నగదును దోచుకుని అక్కడి నుండి పరారయ్యాడు. ఇట్టి విషయం పై బస్ స్టాండ్ కంట్రోలర్  షెర్ల సత్య గౌడ్ ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే, గత ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి సుమారు 8:55 గంటల సమయంలో, బస్టాండ్ ఎంక్వయిరీ కౌంటర్ వద్ద నిందితుడు ఆకాష్ నాగురావ్ కోవె, మరో కూలీ అయిన శ్రీనివాస్‌తో మొబైల్ ఫోన్ విషయమై గొడవకు దిగాడు. ఈ క్రమంలో నిందితుడు శ్రీనివాస్‌పై ముఖం, ఛాతిపై తీవ్రంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం బాధితుడి వద్ద ఉన్న ఒప్పో  మొబైల్ ఫోన్,  రూ. 300 నగదును దోచుకుని నిందితుడు పరారయ్యాడు. బస్టాండ్ కంట్రోలర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా నిందితుడు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు గుర్తించారు.

శనివారం కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు నిందితుడిని పట్టుకుని విచారించగా, అతను తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుండి చోరీకి గురైన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు. మహారాష్ట్రలోని యావత్ మాల్ జిల్లా ఆర్మీ తాలూకా పంగిడి గ్రామానికి చెందిన ఆకాష్ నాగరావు కోవే ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.  మరణించిన వ్యక్తికి సంబదించిన ఒక అప్పో కంపెనీ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన కామారెడ్డి పట్టణ ఇన్స్పెక్టర్ బి. నరహరి, ఏఎస్ఐ రంగా రావు, కానిస్టేబుళ్లు కమలాకర్, రాజు, సంపత్ లను  ఏఎస్పి  ప్రత్యేకంగా అభినందించారు. అలాగే, నిందితుడి ఆచూకీకి సంబంధించిన సమాచారం అందించిన షేక్ సద్దాంను ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించి ప్రశంసించారు.