1 August, 2026 | 7:55 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ   •   జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ఎజెండాగా...   •   రైల్వే కార్మికుల హక్కుల కోసం మజ్దూర్ యూనియన్ నిరంతరం పోరాటం   •   పాదాచారులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణపై సూచనలు   •   ఎదురెదురుగా రెండు బైకులు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు   •   ట్రాఫిక్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి   •   సిద్ధార్థ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా వన మహోత్సవం   •   ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో.   •   ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి 6 వేల జరిమానా   •   ఉన్నత పాఠశాలను సందర్శించిన డిఇఓ   •  

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ పోస్టర్ ఆవిష్కరణ

01-08-2026 06:43 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి): జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 10న  హైదరాబాద్ రవీంద్రభారతిలో   భరతమాత ముద్దుబిడ్డ తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 376 వ జయంతి వారోత్సవాలు నిర్వహిస్తున్నామని గౌడ సోదరులంతా హాజరై విజయవంతం చేయాలని  జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు టిపిసిసి ప్రధాన కార్యదర్శి  వట్టికూటి రామారావు గౌడ్ పిలుపునిచ్చారు. నేరేడుచర్ల పట్టణంలో జై గౌడ్ ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జై గౌడ్ ఉద్యమ రథసారథి వట్టికూటి రామారావు గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ తెలంగాణలో ఆనాడు గ్రామాలపై జమీందారుల ఆగడాలకు చలించిపోయి కళ్ళు గీస్తే ఏమొస్తది కొడితే గోల్కొండ కోటనే కొట్టాలని శపధం చేసి బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి గెరిల్లా పోరాటంతో  మొగల్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసి

  ఏడున్నర నెలలు గోల్కొండ కిల్లాను, 21 కోటలు కట్టించి 30 సంవత్సరాలు వివిధ ప్రాంతాలను పరిపాలించిన  గొప్ప వీరుడని చత్రపతి శివాజీ మహారాజ్ సమకాలికుడని కీర్తించారు. జై గౌడ్ ఉద్యమ కమిటీ బాధ్యులు కొప్పు లక్ష్మీనారాయణ గౌడ్, చామకూరి వీరయ్య గౌడ్ లు ఏర్పాటు చేసిన ఈ  కార్యక్రమంలో జై గౌడ్ ఉద్యమ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుండ్రాతి నారాయణ గౌడ్ జై గౌడ్ జాతీయ అధికార ప్రతినిధి శేష గాని నరేష్ గౌడ్ ఆవుల కోటి గౌడ్ బొల్లగాని సుబ్బు గౌడ్, దొంతగాని వెంకటేశ్వర్లు గౌడ్ బొడ్డు నాగభూషణం గౌడ్, బుడిగ శంకర్ గౌడ్  కుమార్ గౌడ్ పోలగాని భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.