1 August, 2026 | 8:37 PM

ఉన్నత పాఠశాలను సందర్శించిన డిఇఓ

01-08-2026 07:19 PM

 మేళ్లచెరువు:  మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి కే అశోక్ సందర్శించారు. ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించి, విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టారు.పాఠశాల ఉపాధ్యాయుల హాజరును పరిశీలించి,ప్రతిరోజు ఉపాధ్యాయులు, విద్యార్థులు తప్పనిసరిగా ముఖ హాజరు వేయాలని సూచించారు. మండల పరిధిలోని ఉపాధ్యాయులు మరియు పాఠశాల నిర్వహించిన బేస్ లైన్ టెస్ట్ యొక్క మార్కులను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయుడు నారపరెడ్డి ఉన్నారు.