27 April, 2026 | 1:52 AM

ఆదియోగి ధ్యాన శివుడి విగ్రహావిష్కరణ

27-04-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్26 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బాలేశ్వర స్వామి ఆలయ ఆవరణలో శ్రీ ఆదియోగి ధ్యాన పరమశివుడి విగ్రహా ఆవిష్కరణ ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన రావుల వంశస్థులు ఏర్పాటు చేసిన ఈ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ కు చెందిన ముత్యంపేట గౌరీ శంకర శర్మ ప్రత్యేక పూజలు చేసి ఆవిష్కరణ చేశా రు.

ఉదయం పట్టణంలోని వాసవి మాత ఆలయం నుండి పరమశివుడి పాటాలతో శోభాయాత్ర నిర్వహించి బాలేశ్వర ఆలయంలో అర్చకులు శ్రీధర్,బాలేశ్వర్ ల ఆధ్వర్యంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ  ప్రముఖు లు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.