తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ
బోథ్,(విజయక్రాంతి): నేరడిగొండ మండల కేంద్రంలో నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమీప భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీ సత్తా చాటుకుంటున్న అన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల నుండి తమ పార్టీలోకి వచ్చేందుకు నాయకులు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ రక్షణ సేన పార్టీ తెలంగాణ ప్రజలకు రక్షణగా ఉంటుందన్నారు.గ్రామ గ్రామాన పార్టీ జెండాలను ఎగురవేసి జెండా పండుగలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు .తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పే విధంగా ఈ ఉత్సవాలను పార్టీ శ్రేణులు వైభవంగా నిర్వహించాలన్నారు.మండల కేంద్రాలలో పార్టీ జెండాలను ఆవిష్కరించి అమరవీరులకు ఘన నివాళులు అర్పించాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో పలు గ్రామాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.






