30 June, 2026 | 9:45 PM

Breaking News

రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •  

భారత్‌కు అమెరికా కోర్టు సమన్లు

20-09-2024 01:50 AM

గురుపత్వంత్ పిటిషన్ మేరకు ఆదేశాలు

వాషింగ్టన్, సెప్టెంబర్ 19: తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్‌సింగ్ అమెరికా కోర్టు ను ఆశ్రయించడంతో భారత్ ప్రభుత్వానికి సమన్లు అందాయి. భార త్‌తోపాటు ఎన్‌ఎస్‌ఏ అజిత్‌దోవల్, రా ఏజెంట్ విక్రమ్, రా మాజీ చీఫ్ గోయల్, బిజినెస్‌మ్యాన్ నిఖిల్ పేర్లు ఆ సమన్లలో ఉన్నాయి. 21 రోజుల్లో సమాధానం ఇవ్వాలని దానిలో పేర్కొన్నారు. అమెరికాపై పన్ను త్యకు కుట్రను తాము భగ్నం చేశామని ఆ దేశం పేర్కొన్నది. నిఖిల్ సుపారీ ఇచ్చారని ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. ఈ సమాచారంతోనే నిఖిల్‌ను అరెస్ట్ చేశా మని, ఆ తరువాత అతడిని యూఎస్‌కు అప్పగించామని చెక్ అధికా రులు తెలిపారు. హత్య కుట్ర ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. దర్యాప్తు కూడా ప్రారంభించింది.