30 June, 2026 | 9:41 PM

Breaking News

ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •  

తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష

30-06-2026 09:08 PM

బిఆర్ఎస్ తోనే... మేడ్చల్ జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి

ప్రత్యేక ఓటరు నమోదులో కార్యకర్తల కృషి మరువలేనిది

మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి మహేందర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి

జవహర్ నగర్,(విజయక్రాంతి): తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే  శ్రీరామరక్ష అని మేడ్చల్ జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి చెందిందని కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి ఇసుమంతైన ముందుకు సాగుతలేదని బిఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్రెడ్డి దుయ్యబట్టారు. ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియను పురస్కరించుకొని మాజీ మేయర్ మేకల కావ్య బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల ముదిరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం జవహర్ నగర్ లోని 527, 528, 530 బూతులలో బిఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్రెడ్డిలు పలువురు ఓటర్లను కలిసి ఎస్ఐఆర్ పై ప్రత్యేక అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఓటు మానవుడికి వజ్రాయుధం లాంటిదని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హులైన ప్రతి పౌరుడు పొందాలని పిలుపునిచ్చారు. ఓటర్ నమోదులో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కృషి అభినందనీయమని మేడ్చల్ జిల్లాను సర్ ప్రక్రియలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని అన్నారు. అనంతరం కాలనీలో పర్యటించి ఓటర్ నమోదును పరిశీలించారు.