calender_icon.png 16 February, 2026 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమీబియాపై యూఎస్‌ఏ విజయం

16-02-2026 12:04:01 AM

చెన్నై, ఫిబ్రవరి 15 : టీ20 ప్రపంచకప్‌లో యూఎస్‌ఏ మరో విజయం సాధించింది. ఇప్పటికే నెదర్లాండ్స్‌పై గెలిచిన ఆ జట్టు తాజాగా నమీబియాను ఓడించి సూపర్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మాచ్‌లో యూఎస్‌ఏ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఎస్‌ఏ 199 పరుగుల భారీ స్కోరు చేసింది.

కెప్టెన్ మోనాంక్ పటేల్(52) , సంజయ్ కృష్ణమూరి ్త(68) హాఫ్ సెంచరీలతో రాణించారు. నమీబియా బౌలర్లలో మైబుర్గ్, కెప్టెన్ ఎరాస్మస్ తలో 2 వికెట్లు తీశారు. అనంతరం నమీబియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఎస్‌ఏ బౌలర్లు నమీబియా బ్యాటర్లను కట్టడి చేశారు.

స్కాల్విక్ 2, శుభమ్ రంజనే, నేత్రావల్కర్, అలీ ఖాన్ తలో వికెట్ తీశారు.  యూఎస్‌ఏకు సూపర్-8కు చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. ఈ రెండు విజయాలు మాత్రం ఖచ్చితంగా ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచేవే. ఆడుతున్నది రెండో ప్రపంచకప్ అయినప్పటకీ పలు అద్భుత విజయాలు సాధించి మేటి జట్టుగా పేరు తెచ్చుకుంది.

తమ కంటే ముందు నుంచే ప్రపంచకప్ ఆడుతున్న నెదర్లాండ్స్, నమీబియా లాంటి జట్లను ఓడించడం యూఎస్‌ఏ సత్తాకు నిదర్శనం. గత ఎడిషన్‌లోనూ ఈ జట్టు  వారి కంటే చాలా రెట్లు మెరుగైన పాకిస్తాన్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. ప్రస్తుత ఎడిషన్‌లోనూ పాక్‌తో పాటు భారత్‌కు కూడా టఫ్ ఫైట్ ఇచ్చి అభిమానుల మనసులు గెలుచుకుంది.