8 April, 2026 | 4:20 PM

Breaking News

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు   •   ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లో భారతీయులకు అలర్ట్.. వెంటనే బయటకు రండి, కేంద్రం అత్యవసర సూచనలు!   •  

రఫ్ఫాడించిన అరుంధతి

16-02-2026 12:05 AM

సిడ్నీ, ఫిబ్రవరి 15: ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల శుభారంభం చేసింది.  సిడ్నీ వేదికగా జరిగిన తొలి టీ20లో డక్‌వర్త్‌లూయీస్ పద్ధతిన 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి నాలుగు వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు 18 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌటైంది. జార్జియో వేర్హమ్ 30, ఫోబే లిచిఫీల్ 26, ఎల్లిస్ పెర్రీ 20 రన్స్‌తో టాప్ స్కోరర్లుగా నిలిచారు.

అయితే ఈ ముగ్గురిని అరుంధతి రెడ్డినే ఔట్ చేసింది.  అనంతరం భారత మహిళల జట్టు వర్షం అంతరాయం కలిగించే సమయానికి 5.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు డీఎల్‌ఎస్ పద్దతిన మ్యాచ్ ఫలితాన్ని తేల్చారు. భారత్ 21 పరుగుల ముందంజలో ఉండటంతో విజేతగా ప్రకటించారు. దీనితో సిరీస్‌లో భారత్ 1- ఆధిక్యంలో నిలిచింది.