గాలికుంటు వ్యాధి నివారణకు టీకా
నేటి నుండి ఏప్రిల్ 9 వరకు పశువులకు ఉచిత టీకాలు
చేవెళ్ళ మార్చి 9(విజయక్రాంతి): చేవెళ్ళ పశుసంవర్ధక శాఖ వైద్యుల అధ్వర్యంలో మండలనలోని వివిధ గ్రామాల్లో నేటి నుండి ఏప్రిల్ 9వరకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణకు పశువులకు టీకాలు వేస్తామని పలుగుట్ట ప్రాథమిక పశుసంవర్ధక శాఖ అధికారి డా. శిరీష ప్రకటన విడుదల చేశారు. వేసవిలో పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా ముందస్తు చర్యలు చేపట్టడంలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నమన్నారు.
అధికారులు రెండు టీములుగా ఏర్పడి నేటి నుండి ఏప్రిల్ 9 వరకు గ్రామాల వారిగా పశువులకు ఉచిత టీకా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కావున పశు పోషక రైతులు తమ పశువులకు టీకాలు వేయించాలని కోరారు. ఈ టీకాలు వేయించడం వల్ల పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా కాపాడవచ్చు అన్నారు. రైతులు తప్పనిసరిగా తమ పశువులకు వ్యాక్సినేషన్ వేయించాలని కోరారు.




