10 March, 2026 | 1:19 AM

గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఎం నిరసన

10-03-2026 12:22 AM

బచ్చన్నపేట, మార్చి 9 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెం టనే తగ్గించాలని జనగామ జిల్లా చిన్న రా మంచర్లలో సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. సీపీఎం నాయకుడు రామగల్ల అశోక్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల నడ్డి విరిచిందన్నారు.

అలాగే లేబర్ కోడ్ చట్టాలను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాసి, ఇప్పుడు గ్యాస్ ధరలను పెంచి ప్రజల బతుకులను వెనక్కి నెట్టేస్తుందని మండిపడ్డారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చే శారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాఖ కార్యద ర్శి బుర్రి సుధాకర్, మండల కమిటీ స భ్యులు అన్న బోయిన రాజు, నాయకులు కొ త్తపల్లిబాల నరసయ్య, గుడికందుల కనక య్య, కంత్రి ఐలయ్య, గంధమాల మనోహర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.