calender_icon.png 20 February, 2026 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలువలతో కూడిన విద్య, నైతికత అవసరం

20-02-2026 12:00:00 AM

  1. దేశ సమగ్రతకు తోడ్పాటు నిస్తుంది
  2. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు బానిసకావొద్దు
  3. బాధ్యతాయుతమైన పౌరులుగా తయారు చేయాలలి
  4. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

మేడ్చల్, ఫిబ్రవరి19 (విజయక్రాంతి): విలువలతో కూడిన విద్య, నైతికత అనేది దేశ సమగ్రతకు తోడ్పాటు నిస్తుందని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. జీడిమెట్లలో బీడీఎల్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణా కేంద్రానికి గురువారం గవర్నర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మొబై ల్ ఫోన్లు వాడకం ద్వారా ప్రత్యక్ష అనుభవం, కార్యకలాపాలు మరుగున పడుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు ప్రత్యక్ష కార్యక్రమాలు అవసరమన్నారు.

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో పాటు రెడ్ క్రాస్, ఎన్‌సీసీ వంటి ఇతర సంస్థలతో కూడా భాగ స్వామ్యం చేసుకుంటూ దేశ బలోపేతానికి పాటు పడాలని కోరారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత లాగే, ‘విద్యా సామాజిక బాధ్య త’ కూడా ఉండాలని కోరారు. కేవలం మం చి డాక్టర్లు, ఇంజనీర్లను మాత్రమే కాకుండా, బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయడం ముఖ్యమని చెప్పారు.

నేటి తరం పిల్లలు ఎక్కువ సమయం ఫోన్ స్క్రీన్లకే పరిమితమవుతున్నారని, ప్రాపంచిక జ్ఞానంతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ క్యాంపస్‌ను ఒక గొప్ప శిక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయాలని, ఇది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులందరికీ ఉపయోగపడాలని ఆకాంక్షించారు. బీడీఎల్ వారి సౌజన్యంతో నిర్మిం చే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ కేంద్రానికి బాడెన్ పావెల్ మెమోరియల్ హాల్ అని పేరు పేట్టుకోవడం ఎంతో హర్షణీయమన్నారు.

తెలం గాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం దాన కిషోర్ మాట్లాడుతూ దేశసేవలో మనల్ని మనం పునరంకితం చేసుకోవాలని, అందుకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒక సదావకాశమని అన్నారు. శిక్షణ కేంద్రా న్ని నిర్మించేందుకు బీడీఎల్ వారు ముందుకొచ్చి ఆర్థిక చేయుత అందించడం చాలా గొప్ప విషయమన్నారు.

కార్యక్రమంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇ నవీన్ నికోలస్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ బీఎస్ శర్మ, బీడీఎల్ డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ గాయత్రి ప్రసాద్, జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) విజయేందర్ రెడ్డి, ఆర్డీవో శ్యామ్ ప్రకాష్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్ కుమారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.