calender_icon.png 20 February, 2026 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ ఎన్నిక

20-02-2026 12:00:00 AM

జహీరాబాద్, ఫిబ్రవరి 19 : జహీరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో చైర్మన్ ఎన్నికను ని బంధనలకు విరుద్ధంగా ఎన్నిక చేశారని 27 వ కౌన్సిలర్ స్రవంతి ఎన్నికల కమిషనర్ ఫి ర్యాదు చేశారు. గురువారం నాడు రాష్ట్ర ఎ న్నికల కమిషనర్ రాణి కుముదిని కలిసి ఫి ర్యాదు చేశారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ స్రవంతి మాట్లాడుతూ తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల నిబంధనలను కమిషనర్ తుంగలో తొక్కి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టారని ఆరోపించారు.

ఓటింగ్ కోసం కౌన్సిలర్ల పేర్లను క చ్చితంగా అక్షర క్రమంలో పిలవాల్సి ఉండ గా తన పేరు మొదటి స్థానంలో రావాల్సి ఉండగా రిటర్నింగ్ అధికారి నిబంధనలను పక్కనపెట్టి తమకు నచ్చిన విధంగా పేర్లను పిలిచారని స్రవంతి ఆరోపించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థికి ప్రయోజ నం చేకూర్చేలా ఎన్నికల అధికారులు వ్యవహరించారని ఆమె పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో స్ఫూర్తికి విరుద్ధమని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.

ఎన్నికల ప్రక్రియ లో పారదర్శకత లోపించిందని, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 సెక్షన్ 14 (3) రూల్ 4 నిబంధనలను రిటర్నింగ్ అధికారి ఉల్లంఘించారని ఫిర్యాదు చేశామన్నారు. చైర్మన్ ఎన్నిక పూర్తిగా చట్ట విరుద్ధంగా చేశారని పేర్కొన్నారు. తక్షణమే చైర్మన్ ఎన్నిక చె ల్లదని ప్రకటించాలని, పారదర్శకతతో మళ్ళీ ఎన్నిక నిర్వహించాలన్నా రు. న్యాయం జరిగే వరకూ తన పోరాటం ఆగదని, ప్రజాస్వా మ్య పద్ధతిలోనే తన పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పారు. ఉన్నతాధికారులు స్పందిం చి విచారణ జరిపించాలని స్రవంతి విజ్ఞప్తి చేశారు.