calender_icon.png 20 February, 2026 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శతక సాహిత్య మంజరి పుస్తకావిష్కరణ

20-02-2026 12:00:00 AM

ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ హుస్సేన్

మెదక్, ఫిబ్రవరి 19(విజయ క్రాంతి) : తెలుగు సాహిత్యంలో విశిష్టమైన శతక సాహిత్య ప్రక్రియలో శతక సాహిత్య మంజరి అను పేరుతో ప్రచురించిన పుస్తకమును ఆవిష్కరించినట్టు ప్రి న్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. తెలుగు సాహిత్యములో కల అనేక ప్రక్రియలలో శతక ప్రక్రియ ఒకటి. ఈ ప్రక్రియ పండిత, పామరలోకాన్ని, విద్యార్థులను అలరించిన ప్రక్రియ అని పేర్కొన్నారు.

తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ వాహనమూర్తి మాట్లాడుతూ సమాజానికి హితమును చేకూర్చే శతక సాహిత్య ప్రక్రియ గొప్పతనాన్ని పుస్తక రూపంలో వెలువరించినందుకు అధ్యాపకుడు వేణుగోపాల శర్మను అభినందించారు. వేణుగోపాల శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న తెలుగు అధ్యాపకులు, పరిశోధకుల నుండి శతక సాహిత్య ప్రక్రియ పైన వ్యాసాలను సేకరించి భావవీణ సంచికను వెలువరించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సింహారెడ్డి, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డా క్టర్ తిరుమలరెడ్డి డాక్టర్ శరత్ రెడ్డి, డాక్టర్ అరుంధతి, డాక్టర్ జ్ఞానానందం, డాక్టర్ సుధాకర్, ఇతర అధ్యాపకులు, పరిపాలన అధికారి అంజాద్ అలీ, ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.