ప్రజల సంక్షేమమే లక్ష్యం
మైసమ్మ తల్లి బోనాల్లో వంగ రాజేశ్వర్‌రెడ్డి..
సిద్దిపేట రూరల్,ఆగస్టు 9: పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌లో నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మైసమ్మ తల్లి బోనాల మహోత్సవంలో వంగ రాజేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ప్రజల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ వారి ప్రతి సంతోషంలో, కష్టంలో అండగా ఉండటమే తన లక్ష్యమని వంగ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రజలపై మైసమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో 7వ వార్డు కౌన్సిలర్ బుచ్చిరెడ్డి, వార్డు సభ్యుడు లవకుమార్, ఆలయ కమిటీ సభ్యులు, నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, మహిళలు, యువత, భక్తులు పాల్గొన్నారు.






