ఆసియా క్రీడలకు వరుణ్ చక్రవర్తి దూరం
16-09-2026 | 02:56pm
అతడి స్థానంలో విప్రాజ్
న్యూఢిల్లీ: పక్కటెముకల నొప్పితో సీనియర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy ) ఆసియా క్రీడల(Asian Games) ఖండాంతర ఈవెంట్ నుండి వైదొలగడంతో, అతని స్థానంలో యువ లెగ్-స్పిన్ ఆల్-రౌండర్ విప్రజ్ నిగమ్ భారత ఆసియా క్రీడల జట్టులో చేరనున్నాడు. జపాన్లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 19న ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. వరుణ్ నిరవధిక కాలం పాటు జట్టుకు దూరమయ్యాడు. సుదీర్ఘ జాబితా నుంచి విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. కుల్దీప్ ఈ నెల చివర్లో వెస్టిండీస్ వన్డేలు ఆడతాడని బీసీసీఐ మీడియాకి తెలిపింది.