01-08-2024 03:48:02 PM
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపరిచితుడు, ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేసి పోలీసు వ్యానులో పోలీసు స్టేషన్ కు తరలించారు. సభలో ప్రతిపక్ష శాసనసభ్యులకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదని, సీనియర్ ఎమ్మెల్యేలు అనే గౌరవం లేకుండా అవమానించారని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని మహిళా ఎమ్మెల్యే 4 గంటలు అడిగినా సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పట్టించుకోలేదన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడే దమ్ము వీళ్లకు ఉందా..? అని ప్రశ్నించారు. దేశంలోని 36 పార్టీలను ఒప్పించి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ తెలంగాణ కోసం కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం కనీసం ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయలేదని ఎద్దేవా చేశారు. ఎస్పీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే ఎస్సీ వర్గీకరణపై మా పార్టీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిందన్నారు. భారస మొదట్నుంచి ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలిపిందని, సుప్రీంకోర్టు తీర్పును ఈ ప్రభుత్వం తర్వగా అమలు చేయాలని కోరుతున్నట్లు ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.