24-02-2026 12:16:02 AM
గుండె జబ్బులపై అవగాహన లోపం..
వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యాలు నిరుపయోగం..
అర్ధరాత్రి గుండెపోటుతో వస్తే ప్రాణాలు గాలిలోనే..
అది గుండెపోటా, ఆయాసమా గుర్తించలేని వైద్య బృందం...
కొత్తగూడెం, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులు సకల సౌకర్యాలతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని చేస్తున్న ప్రచారం నేతి బీరకాయలు నెయ్యి చందాన ఉందనే ఆరోపణ వినిపిస్తోంది. సౌకర్యాలు, మెరుగైన వైద్యం మాట దేవుడెరుగు కనీసం రోగికి సంబంధించిన వ్యాధి లక్షణాలు గుర్తించలేని వైద్య బృందం పనిచేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అది ప్రభుత్వ దావకాన , ప్రజల మనసులో మాట,నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు ,అన్న పాట ఒకప్పటి మాట.. అది నేడు నిలువెత్తు సాక్షంగా దర్శనమిస్తోంది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పరిసర ప్రాంతంలోని పలు గ్రామాలకు ఉన్న ,ఏకైక జనరల్ ఆసుపత్రి కొత్తగూడెం కూలి లైన్ లో ఏర్పాటు చేశారు. సకల సౌకర్యాలు ఉన్నాయి ప్రభుత్వాసుపత్రికి రండి, అని ప్రజలను నమ్మబలికించి ప్రాణాలను గాల్లో కలిపేసే ప్రక్రియ జరుగుతుందా అనే సంఘటన జరిగిన సందర్భాలు ఉన్నాయి.
జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి పలు గ్రామాల్లో ప్రజలు నిత్యం వేల సంఖ్యలో ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుంటారు. ఈ క్రమంలో చాలామంది రోగులకు వైద్య సదుపాయాలు కల్పించి వారికి ఆసరగా నిలుస్తారు వైద్యులు. కొత్తగూడెం ఆస్పత్రిలో అంతా సపరేట్. మనిషి, మనిషికి చాలా వ్యత్యాసం బీద గొప్ప పర్యంతం. ఈ దవఖాన అర్థరాత్రి వైద్యం కోసం వీరి దగ్గరికి వస్తే వారి ప్రాణాలు గాల్లో కల్పెస్తున్నారు. గత నెల జనవరి 14వ తేదీ అర్ధరాత్రి ఒక మహిళ ఆయాసంతో వచ్చి ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటి కే ప్రాణాలు గాల్లో కలిశాయి.
సదరు రోగి కుటుంబ సభ్యులు ముందుగా సమాచారాన్ని ఇచ్చినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఇంతకు ముందు రెండు స్టంట్ లు వేశారు అని చెప్పినా,వారు వచ్చింది ఆయాసమా, గుండేపోటా అని నిర్ధారించుకునే సమర్థవంతమైన వైద్యులు లేకపోవడం విడ్డూరం. గుండెపోటును ఆయాసం అంటూ ఆక్సిజన్ పెట్టి గాల్లో కలిపేశారనీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తు న్నారు. ఆ ఆక్సిజన్ కూడా పనిచేయట్లేదు అన్న విషయాన్ని గుర్తించలేక ఆవిడ ప్రాణాలు బలి తీసుకున్నారు.
గుండెపోటు నిర్ధారణ అయ్యేలోపు గంటపాటు డాక్టర్లు నిర్లక్ష్యం వహించడం వల్ల ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడింది, ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చారు. ఆక్సిజన్ అందించే లోపు ఆవిడ ప్రాణాల్ని హరించేశారు తదనంతరం సిపిఆర్ చేయడం కూడా ఐదు నుంచి పది నిమిషాలు తప్ప అంతకంటే ఎ సమర్థవంతమైన సిపిఆర్ చేయలేకపోయారు. గుండెకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయాల్సిన వైద్యులు అది గుర్తించలేని దీనస్థితిలో ఉన్న వైద్య బృందాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గుండెపోటు వచ్చినటువంటి వారికి ఆక్సిజన్ పెట్టి నిర్ధాక్షణంగా ప్రాణాలు హరించేశారు. ఆ సమయంలో రోగి చెబుతూనే ఉందనీ , ఇది పెట్టుకుంటే ఊపిరాడట్లేదు అని, ఆ సమయంలోనే విధులు నిర్వహిస్తున్న వైద్యులు. గుండెపోటుతో విలువల్లాడుతున్న ఆ మహిళకు ఆక్సిజన్ మాస్క్ నోటికి ముక్కుకు ధరింపజేసి పూర్తిగా ఊపిరి అడగకుండా చేసి ఆమె మరణానికి కారకులైనారనీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ సంఘటన మరువక ముందే ఫిబ్రవరి మూడవ తేదీన ఒక బీఆర్‌ఎస్ నాయకుని సోదరుడు ఆసుపత్రిలో చేరితే, కనీసం ఆక్సిజన్ ఉండి కూడా నిరుపయోగంగా ఉందని వారికి తెలియకుండా మాస్క్ పెట్టి ఆక్సిజన్ తో ఊపిరడకుండా చేసే ప్రయత్నం జరిగింది .వెంటనే సదరు సోదరుడు స్పందించి జిల్లా కలెక్టర్ కి చరవాని ద్వారా ఈ మెసేజ్ ని పంపించిన వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ఆక్సిజన్ సదుపాయం ఏర్పరచాలని ఆస్పత్రి సిబ్బందికి చెప్పడం గమనార్హం. దీంతో ఆ రోగి ఊపిరి పీల్చుకొని రెండు రోజుల తర్వాత అతనిని హైదరాబాద్కు రిఫర్ చేశారు.
ఇంతటి నిర్లక్షయంగా,విధులు నిర్వహిస్తున్న ఆ సిబ్బందికి పై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా, నిర్లక్ష్యం వీడి వచ్చిన రోగులకి సరే ఆయన వైద్యం అందించాలని కోరుతున్నారు.