calender_icon.png 19 February, 2026 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్డ్‌సమస్యలు పరిష్కరించే దిశగా వైస్ చైర్మన్ ప్రయాణం

19-02-2026 12:00:00 AM

ఎల్లారెడ్డి ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మరుసటిరోజే, పనులు ప్రారంభించిన వైస్ చైర్మన్ మతమాల భాగ్యవతి. ఎల్లారెడ్డి పట్టణంలోని ఏడో వార్డులో జరుగుతున్న అమృత్ 2.0 ప్రాజెక్టు ద్వారా ఇంటింటి కులాయి కనెక్షన్ ఇస్తున్న సందర్భంగా ఎల్లారెడ్డి వైస్ చైర్ పర్సన్, మతమాల భాగ్యవతి, ఎల్లారెడ్డి మాజీ ప్రాథమిక సహకార సంఘం ఉపాధ్యక్షులు ప్రశాంత్ గౌడ్ పనులను పర్యవేక్షించారు. వార్డులో ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశానుసారం ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని లక్ష్యంగా పనిచేయాలని ఆమె గుత్యదారుకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు.