విజయం మనదే నాన్నా!
- కేరళం మాజీ సీఎం ఊమెన్ చాందీ తనయుడు చాందీ ఊమెన్ భావోద్వేగం
- తండ్రి సమాధి వద్ద నిలబడి ఉన్న ఫొటోతో పోస్టు
త్రివేండ్ర, మే 4: కేరళంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధిం చింది. ఈ గెలుపుపై దివంగత మాజీ సీఎం ఊమెన్ చాందీ తనయుడు చాందీ ఊమెన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. తండ్రి సమాధి వద్ద చాందీ ఊమెన్ నిలబడి ఉన్న ఫొటోను జత చేస్తూ ‘నాన్నా.. మనమే గెలిచాం’ అం టూ పోస్టు చేశారు.
దశాబ్దాల పాటు తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన పూతుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చాందీ ఊమెన్, తన ప్రత్యర్థి ఎల్‌డీఎఫ్ అభ్యర్థి కేఎం రాధాకృష్ణపై 52,907 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. కాగా చాందీ ఊమెన్ ఎన్నికల ప్రచారంలో కార్లు కాకుండా సాధారణ ఓటరును కలిసేందుకు నియోజకవర్గమంతా సైకిల్‌పైనే తిరిగారు. అనవసరపు ఖర్చులను అరికట్టేందుకు ఫ్లెక్సీ లు, పోస్టర్లకు దూరంగా ఉన్నారు. ప్రచారానికి కేటాయించిన నిధులను నిరాశ్రయులకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఉపయోగిస్తానని ప్రకటించి అందరి ప్రశంసలు అందుకున్నారు.






