విజయ్ డ్రైవర్ కొడుకు గెలుపు
- విరుగంబాక్కం నుంచి గెలిచిన శబరినాథన్
- డీఎంకే అభ్యర్థిపై ౨౭వేల ఓట్లతో విజయం
చెన్నై, మే 4: తమిళనాడులో విజయ్ మార్క్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయి. గతంలో తన వ్యక్తిగత డ్రైవర్, ప్రస్తుతం వ్యక్తిగత సహాయకుడు అయిన రాజేంద్రన్ కొడుకు శబరినాథన్ టీవీకే తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు. శబరినాథన్ తండ్రి రాజేంద్రన్ గత 15 ఏళ్లుగా దళపతి విజయ్ వద్ద వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తు తం పీఏగా కొనసాగుతున్నారు. రాజేంద్రన్ కుటుంబంపై నమ్మకంతో, ఆయన కుమారుడు శబరినాథన్‌కు విజయ్ రాజకీయాల్లో అవకాశం కల్పించారు.
2024లో పార్టీ స్థాపించినప్పటి నుంచి శబరినాథన్ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషి చేశారు. శబరినాథన్‌కు విరుగంబాక్కం టికెట్ ఇచ్చే సమయంలో విజయ్ చేసిన ప్రకటన తమిళనాట సంచలనం సృష్టించింది. ‘నా డ్రైవర్ రాజేంద్రన్ 15 ఏళ్లుగా నా వెంటే ఉన్నాడు, ఇప్పుడు అతని కొడుకు నాతో కలిసి రాజకీయాల్లో నడుస్తాడు’ అని విజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన అన్నట్టుగానే విరుగంబాక్కం నియోజకవర్గంలో శబరినాథన్ తన సమీప డీఎంకే అభ్యర్థి ప్రభాకర్ రాజాపై 2౭ వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.






