మాడ్రిడ్ స్వియాటెక్‌దే

06-05-2024 02:46:36 AM

ఫైనల్లో సబలెంకాపై విజయం

మాడ్రిడ్: ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వియాటెక్ అదరగొట్టింది. ఎక్కడైతే రన్నరప్‌గా నిలిచిందో అదే వేదికపై పులిలా గర్జించి ఈసారి చాంపియన్‌గా నిలిచింది. శనివారం అర్థరాత్రి జరిగిన ఫైనల్లో పోలాండ్‌కు చెందిన స్వియాటెక్ 7 4 7 రెండో సీడ్ అరీనా సబలెంకా (బెలారస్)పై విజయం సాధించి తొలిసారి టైటిల్‌ను అందుకుంది. ఆద్యంతం ఉత్కంఠభరితం గా సాగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను స్వియాటెక్ 7 సొంతం చేసుకుంది. అయితే రెండో సెట్‌లో ఫుంజుకున్న సబలెంకా బలమైన ఫోర్ హ్యాండ్ షాట్లతో విరుచుకుపడి 4 సెట్‌ను కైవసం చేసుకుంది. ఇక మూడో సెట్‌లో ఇరువురు హోరాహోరీగా తలపడడంతో సెట్ టై బ్రేక్‌కు దారి తీసింది. నిర్ణయాత్మక టై బ్రేక్ సెట్‌లో తన నంబర్ వన్ ఆటను చూపించిన స్వియాటెక్ సెట్‌ను సొంతం చేసుకోవడంతో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. కాగా 2023లో మాడ్రిడ్ ఓపెన్‌ను సబలెంకా సొంతం చేసుకుంది. ఆ ఏడాది ఫైనల్లో ఓడిన స్వియాటెక్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. సరిగ్గా ఏడాది అనంతరం సబలెంకాపై ప్రతీకారం విజయంతో మాడ్రిడ్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచి సత్తా చాటింది.