15 May, 2026 | 7:07 PM

ఒక్క పిలుపు.. విజ్ఞానంలో మేలుకొలుపు

15-05-2026 06:00 PM

భైంసా,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ భవేష్ మిశ్రా వినూత్న రీతిలో ఓ పిలుపు విజ్ఞానం వైపు మళ్లించింది. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న జిల్లా స్థాయి అధికారులు మొదలుకొని క్రింది స్థాయి అధికారులకు ఒక్కొక్క పుస్తకాన్ని డొనేట్ చేయాలని పిలుపునిచ్చారు. అన్ని శాఖల్లో పనిచేసే ఉద్యోగులు వారి ఇంట్లో ఉన్న విజ్ఞానం అందించే వివిధ రకాల పుస్తకాలను కొత్త పాత చరిత్ర కలిగిన స్ఫూర్తినిచ్చి పుస్తకాలను సేకరించ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్నకు అందించారు. ఈ పుస్తకాలను గ్రంథాలయాల్లో పాఠశాలలో ఉన్న గ్రంథాలయాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఒకేరోజు 5 పుస్తకాలను అధికారులు విరాళాలు రూపంలో అందించడంతో కలెక్టర్ పిలుపు విజ్ఞానం వైపు మళ్ళించిందని పలువురు ప్రశంసిస్తున్నారు.