17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

అల్ఫోర్స్‌లో ఘనంగా విజయ్ దివస్ వేడుకలు

17-12-2025 12:00 AM

కొత్తపల్లి, డిసెంబరు 16 (విజయ క్రాంతి): కొత్తపల్లి లోని అల్ఫోర్స్ ఇ- టెక్నో పాఠశాలలో మంగళవారం విజయ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి అమర జవాన్ల చిత్రపటానికి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైనికుల వల్లనే నేడు మన భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. దేశ ప్రజలకు ఎల్లప్పుడూ రక్షణ కల్పించేది వారేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.