calender_icon.png 19 December, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు పారమిత విద్యార్థి

17-12-2025 12:00:00 AM

కొత్తపల్లి, డిసెంబరు 16 (విజయ క్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఈ నెల 17 నుండి 25 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి అండర్-14 క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీలకు నగరంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలకు విద్యార్థి పి కేధార్ నాధ్ ఎంపికైనట్లు పాఠశాల డైరెక్టర్ హన్మంత రావు తెలిపారు. ఇటీవల జిల్లాలోని అలుగునూర్ లో జిల్లాస్థాయి పోటీలలో కేధార్ నాధ్ అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల చైర్మన్ డాక్టర్ ఇ ప్రసాదరావు, డైరెక్టర్స్ ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, రాకేశ్, వి.యు.యం.ప్రసాద్, వినోద్ రావు, కె.హన్మంతరావు, ప్రధానోపాధ్యాయుడు గోపికృష్ణ, సమన్వయ కర్తలు రబీంద్ర పాత్రో, భవానీ, నిఖిత, వ్యాయామ ఉపాధ్యాయుడు జి.మహేష్, యస్. రాజులు అభినందించారు.