calender_icon.png 7 January, 2026 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల గొంతుక 'విజయక్రాంతి'

06-01-2026 12:47:46 PM

నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

వాస్తవాలకు నిలువుటద్దం: ​కొండకల్లా నరేందర్ రెడ్డి

​మణికొండ,(విజయక్రాంతి): సమాజంలో వాస్తవాలను నిర్భయంగా వెలికితీస్తూ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా 'విజయ క్రాంతి' పనిచేస్తోందని మణికొండ మాజీ చైర్మన్ కొండకల్లా నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మణికొండలో 'విజయ క్రాంతి' నూతన క్యాలెండర్‌ను మాజీ కోఆప్షన్ సభ్యులు జొన్నాడ సిద్ధప్ప, బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పత్రికపై ప్రశంసల జల్లు కురిపించారు. విజయ క్రాంతి కేవలం పత్రిక మాత్రమే కాదని, అది సామాన్య ప్రజల గొంతుక అని అభివర్ణించారు. ఇందులోని ప్రతి అక్షరం ప్రజల పక్షాన నిలబడుతుందని, నిష్పక్షపాత వార్తలకు ఇది చిరునామా అని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోవాలంటే పాఠకులు విజయ క్రాంతి చూడాల్సిందేనని ఆయన సూచించారు. సమాజ హితం కోరే ఇటువంటి పత్రికలకు తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని జొన్నాడ సిద్ధప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ శ్రేణులు క్యాలెండర్ ఆవిష్కరణ పట్ల హర్షం వ్యక్తం చేశారు.