4 March, 2026 | 10:27 PM

ఈ నెల 7న వికసిత్ భారత్ యువ కనెక్ట్

04-03-2026 07:12 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కళాశాల లో ఈ నెల 7న వికసిత్ భారత్ యువ కనెక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అఖిలేశ్ కుమార్ సింగ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి పోటీలను వశిష్ట డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. "50 years of emergency: Lessons for Indian democracy" అనే అంశంపై నిర్వహించే డిబేట్ లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలకు కళాశాల NSS సమన్వయకర్త Ch. రవి, సెల్ నెo. 9912039609 సంప్రదించాలని సూచించారు.