4 March, 2026 | 8:07 PM

శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

04-03-2026 07:07 PM

బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

బాన్సువాడ,(విజయక్రాంతి): శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలనీ బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని డి ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన శాంతియుత సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ హిందూ ముస్లింలు తమ తమ పండుగలను సోదర భావంతో కలసి మెలిసి కుటుంబ సభ్యులు గా జరుపుకోవాలని ఆమె అన్నారు.

రంజాన్, శ్రీ రామ నవమి, ఉగాది పండుగలను మత సామరస్యనికి నిదర్శనంగా జరుపుకోవాలని ఆమె కోరారు. అనంతరం డిఎస్పి విట్టల్ రెడ్డి మాట్లాడుతూ హిందూ ముస్లింలు బాయి, బాయి అంటూ కలిసికట్టుగా పండుగలను జరుపుకోవాలని ఆయన సూచించారు. చట్టం అందరికీ సమానమే అని ఎలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టిన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. గతంలో జరిగిన గొడవలు పీడకలగా మర్చిపోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ తుల శ్రీధర్ హిందూ ముస్లిం మత పెద్దలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.