14 March, 2026 | 4:21 AM

కేసీఆర్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి

14-03-2026 01:35 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శుక్రవారం ఆమె నివాసంలో వాంకిడి మండలం బెండర గ్రామానికి చెందిన పలువురు నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మండల అధ్యక్షుడు అజయ్ కుమా ర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వారికి గులాబీ కం డువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజ లు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం బీఆర్ ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మండ ల పార్టీ అధ్యక్షుడు రవీందర్, వాంకిడి మాజీ సర్పం చ్ బండే తుకారం, అఖిల గాండ్ల తేలి సంక్షే మ సంఘం జిల్లా అధ్యక్షుడు హివ్రే సందీప్, విద్యార్థి విభాగం నాయకుడు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.