4 May, 2026 | 12:25 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

వేసవి ఆరంభంలోనే భానుడి భగభగలు

14-03-2026 01:34 AM

జిల్లాలో మొదలైన ఎండల తీవ్రత

రాష్ట్రంలోనే అత్యధిక ఉష్నోగ్రతలు నమోదు

రానున్న రోజుల్లో పరిస్థితి తీవ్రత పై ప్రజల  ఆందోళన

ఆదిలాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే అనూహ్య వాతావరణానికి నెలవుగా ఉం టుంది. ఇక్కడ మూడు కాలాలు నువ్వా.. నేనా అనే రీతిలో ఒకదానికొకటి పోటీ పడుతుంటాయి. ఇన్నాళ్లు అధిక వర్షాల కారణం గా ఇబ్బందులు ఎదుర్కొగా.. తాజాగా ఎం డల తీవ్రత జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మార్చి ప్రారంభంలోనే ఏకంగా 38.8 డిగ్రీల ఉష్నోగ్రతలు నమోదు కావడం జిల్లా వాసులను కలవర పెడుతోంది. దీంతో పట్టణం లోని రోడ్లన్నీ జనసంచారం లేక కర్ఫ్యూ వాతావరణం తలపిస్తున్నాయి. రానున్న మూడు రోజుల పాటు ఎండల తీవ్రత మరింత అధికం కానుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటం జిల్లాలో పరిస్థితి తీవ్రత కు అద్దం పడుతోంది.

రాష్ట్రంలోనే అత్యధికం 

ఎండాకాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న తరుణంలో మొదట్లోనే ఎండలు తీవ్రం కావడం జనాలకు కలవరపాటుకు గురి చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 38.8 డిగ్రీలు నమోదు కావడం రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయి.  మార్చి నెల ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే రానున్న ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్ర జలు ఆందోళనకు గురవుతున్నారు. కిందటి సంవత్సరం  మే నెలలో 44 డిగ్రీల వరకు రోజువారీ ఉష్నోగ్రతలు నమోదయ్యాయి. చిన్నా.. పెద్ద తేడా లేకుండా ఎండ వేడిమికి తళ్లడిల్లిపోయారు. ఈ ఏడాది సైతం అదే పరిస్థితి తలెత్తే అవకాశం కనిపిస్తోంది.

బయటకు వెళ్లాలంటేనే భయం 

ప్రస్తుతం అధిక ఉష్నోగ్రతలు నమోదవుతున్న కారణంగా జనాలు పగటి పూట బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. ముఖ్యంగా కిందటేడాది వడ దెబ్బ భారిన పడి అనేకమంది ఆసుపత్రుల పాలయ్యారు. కొందరు మరణించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం రోడ్ల పక్కన చిరు వ్యాపారం చేసుకునే వారు.. రోజువారీ కూలీలు అధిక ఎండల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులు, వివిధ వ్యా పారస్తులు ఆందోళన చెందుతున్నారు.