12 June, 2026 | 1:30 PM

Breaking News

మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •  

నిరుపేద కుటుంబానికి అండగా విలేజ్ హెల్పింగ్ హ్యాండ్స్

12-02-2026 02:26 AM

వెంకటాపూర్, ఫిబ్రవరి11,(విజయక్రాంతి): మండలంలోని ఇంచెంచెర్వుపల్లి గ్రామానికి చెందిన చెన్న వరలక్ష్మి అనారోగ్యంతో మృతిచెందింది. ఈ ఘటనతో గ్రా మంలో విషాద వాతావరణం నెలకొంది. గ్రామంలో నివసిస్తున్న ఏకైక నాయి బ్రా హ్మణ నిరుపేద కుటుంబానికి మనోధైర్యం ఇవ్వడంతో పాటు ఆర్థికంగా తోడ్పాటు అం దించేందుకు గ్రామస్తులు ముందుకు వచ్చా రు.

విలేజ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ కా మా అశోక్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ముం దుకి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిం చి బియ్యం, నిత్యావసర సరుకులు అలాగే రూ.13,701 నగదును అందించారు. ఇ లాంటి క్లిష్ట సమయంలో గ్రామ ప్రజలు ఐక్యంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ఇంచెంచెర్వుపల్లి గ్రామ ప్రజలకు విలేజ్ హెల్పింగ్ హాం డ్స్ ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సభావత్ ఇస్రా, ఉప సర్పంచ్ సరితా బీద్దురాజ్, వార్డు సభ్యులు చంద్రు, రాజు, సంపత్, సునీత అరుణ్, ప్రవళిక, రాజు, దేవేందర్, విలేజ్ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు విజయ్, రాజు, పృద్విరాజ్, రాజ్ కుమార్, శ్రీను, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.