20-02-2026 09:03:05 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలోని గ్రామసభ గ్రామ సర్పంచ్ పుప్పాల సాయిలు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.గ్రామసభలో పలు సమస్యలపైన చర్చించడం జరిగింది. ముఖ్యంగా పారిశుధ్యం,తాగునీరు, విద్యుత్తు,మరియు గ్రామంలో ప్రస్తుత తరం, భవిషత్ తరాల కోసం వనరులు కాపాడుకోవాలని తీర్మానం, పారిశుధ్య నివారణ కోసం సంవత్సరంలో ప్రతీ 2నెలలకు ఒక రోజు గ్రామంలో స్వచ్ఛ మాల్తుమ్మెద, స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం చేపట్టి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేద్దామని తీర్మానించడం, మహిళా సంఘం భవనం గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుప్పాల సాయిలు, ఉప సర్పంచ్ శివకుమార్ గౌడ్, సెక్రటరీ అశోక్, వాటర్ డిపార్ట్మెంట్ ఏఈ రాజ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.