17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బిఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ 144 అమలు

20-02-2026 09:00 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ నేపథ్యంలో సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన పది పరీక్షా కేంద్రాల వద్ద తేది: 25-02-2026 నుండి 18-03-2026 వరకు ప్రతిరోజు ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు 163 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 144 అమల్లో ఉంటుందని సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

అమలులో ఉండే నిబంధనలు

  • ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడరాదు.
  • నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద సంచరించరాదు. 
  • పరీక్షా కేంద్రం నుండి 200 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లు ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు మూసివేయాలి.
  • పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.