25 March, 2026 | 2:11 AM

ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్తులు

25-03-2026 12:32 AM

బూర్గంపాడు, మార్చి24 (విజయక్రాంతి): మండలంలోని సోంపల్లి ఇసుక క్వారీ నుంచి ఇసుకను తరలిస్తున్న లారీల ద్వారా రోడ్లు ధ్వంసం అవుతున్నాయని బూర్గంపాడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఇసుక టిప్పర్లు, లారీలను అడ్డుకుని నిరసన తెలిపారు.

ఈ మార్గం ద్వారా టిప్పర్లు, లారీలు అధిక లోడుతో తిరుగుతున్నందున ఇబ్బందులు పడుతున్నామన్నారు. లారీలు వెళ్లే మార్గంలోనే విద్యార్థుల వసతి గృహం, బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ లకు వచ్చేవారికి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తుల నిరసన వలన రోడ్డుకి ఇరువైపులా లారీలు ఆగడంతో సంఘటన స్థలానికి ఎస్‌ఐ మేడా ప్రసాద్ చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.