25 March, 2026 | 2:08 AM

త్వరలో సాదాబైనామా పరిష్కారం

25-03-2026 12:31 AM

మంత్రి పొంగులేటి 

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో 2020 నుంచి పెండింగ్ లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను వీలైనంత త్వరితగతిన  పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం  శాసనమండలిలో ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, అంజిరెడ్డి, రవీందర్ రావు, తాతా మధు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాదబైనామాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించిందని, కానీ 2020 ఆర్‌ఓఆర్ చట్టంలో పరిష్కారం మార్గం చూపించలేదన్నారు.

భూ భారతి చట్టంలో ఈ సమస్యకు పరిష్కారం చూపామని, అయితే కొనుగోలుదా రు అమ్మకందారు ఇద్దరి నుంచి అఫిడవి ట్ తీసుకోవాలన్న నిబంధనను పొందుపరచడంవల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవు తున్నాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవి ట్ తీసుకోవాలని నిర్ణయించామని, ఈ మేర కు జీ.ఓ. 76ను విడుదల చేయడం జరిగిందని తెలిపారు.

రాష్ట్రంలో 9 లక్షలకు పైగా దరఖాస్తును పెండింగ్‌లో ఉన్నాయని, వీటన్నింటికీ పరిష్కారం లభించబోతుందని తెలి పారు.  నక్షా లేని 413 గ్రామాలకు గాను 5 గ్రామాల్లో ప్రయోగాత్మమకంగా రీ సర్వే ని ర్వహించామని, ఇందులో ప్రతీ సర్వే నెంబర్‌కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ కేటాయించామన్నారు. ఏప్రిల్ చివరి నాటికి పూర్తి స్థాయిలో ‘భూ భారతి’ తెస్తామన్నారు.