5 August, 2026 | 5:36 PM

సివికా పౌల్ట్రీ ఫార్మ్ ఎదుట గ్రామస్తుల నిరసన

05-08-2026 04:52 PM

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామంలో గల సి వి కా పౌల్ట్రీ ఫార్మ్ వల్ల గ్రామం లో దుర్వాసన ఈగలు,పెరిగిపోయాయని పెద్ద శివునూర్ గ్రామస్తులు సర్పంచ్ నర్సింలు ఆధ్వర్యంలో పౌల్ట్రీ ఫార్మ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు,  సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామ శివారులోని సీవీకే పౌల్ట్రీ ఫార్మ్ వల్ల గ్రామంలోకి దుర్వాసన రావడంతో పాటు గ్రామం మొత్తం ఈగలు వ్యాపిస్తున్నాయని వాపోయారు. గత వర్షాకాలంలో సైతం గ్రామంలో విపరీతంగా ఈగలు పెరిగిపోయాయని పలువురు అనారోగ్యం బారిన పడ్డారని ఆరోపించారు. , పరిశ్రమ యజమానికి నోటీసులు పంపిన  సమాధానం చెప్పలేక మొండి వైఖరి అవలంబిస్తున్నారు.

వెంటనే పరిశ్రమ నిర్వాహకులు గ్రామంలో దుర్వాసన, ఈగలు,రాకుండా చర్యలు తీసుకోవాలని లేదంటే పౌల్ట్రీ ఫార్మ్ ను మూసివేయాలని పేర్కొన్నారు. మూడు గంటల పాటు నిరసన వ్యక్తం చేయగా పౌల్ట్రీ ఫామ్ కు సంబంధించిన నిర్వాహకులు ఎవరూ లేకపోవడంతో రెండు, రోజుల తర్వాత నిర్వాహకులు గ్రామస్తులతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సింలు, ఉప సర్పంచ్ మల్లేశం నాయకులు సురేందర్, అప్పాల శేఖర్, ప్రశాంత్ నాగరాజు, తలారి అశోక్,శ్రీనివాస్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు